Cloth Required For Box Pleated Designer Long Frock For All Age Groups
డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కి ఏ వయసు వారికీ ఎంత Cloth పడుతుంది అనేది ఇప్పుడు ఈ Article లో చూద్దాం.
Cloth Required For Long Frock For Box Pleated Model
YEARS | Body Piece ( In Centimeters ) | Frock Piece ( Box pleated Type ) (in Centimeters & Meters) | Full Lining ( Body Piece + Frock Piece) |
వయసు | బాడీ పీస్ ( సెంటీమీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ ( సెంటీమీటర్స్ & మీటర్స్ లో ) | ఫుల్ లైనింగ్ (బాడీ పీస్ + ఫ్రాక్ పీస్ కి ) |
1 – 3 Years | 40 Cms | 80 Cms | 40 Cms + 80 Cms |
4 – 6 Years | 50 Cms | 1.5 Meters | 50 Cms + 1.5 Meters |
7 – 9 Years | 70 Cms | 2 Meters | 70 Cms + 2 Meters |
10 – 12 Years | 80 Cms | 2.5 Meters – 3 Meters | 80 Cms + 2 Meters |
13 & Above Years | 80 Cms | 3 Meters – 4 Meters | 80 Cms + 2 Meters |
పైన Table లో చెప్పిన క్లోత్ (Cloth) బాడీ పీస్ (Body Piece), ఫ్రొక్ పీస్ (Frock Piece) మాత్రమే. Hands కి separate గా తీసుకోవాలి.
- Normal Hands పెట్టుకోవాలి అంటే 15 Cms ఐతే సరిపోతుంది. ఒకవేళ Frock Piece లో Cloth తో Design Sleeves వీడియో లో చూపించిన మోడల్ హాండ్స్ పెట్టుకోవాలి అంటే 50 cms పడుతుంది ఎవరికైనా. చిన్న పిల్లల సైజు ఐతే 40 Cms Cloth పడుతుంది.
- Lining వచ్చేసి Body Piece కి మామూలుగానే Cloth పడుతుంది, Frock Piece కి petticoat కి ఎలా తీసుకుంటామో అలా వేస్తే పైన Table లో చెప్పిన Cloth తీసుకోవాలి. లేదు Frock Piece లో Frills పెట్టాలి అంటే Frock Piece కి ఎంత Cloth తీశామో అంతే లైనింగ్ కూడా తీసుకోవాలి.
- పైన వీడియో లో మనం Frock Piece కి Box Pleated పెట్టాలి అనుకున్నాం కదా అందువల్ల లైనింగ్ Umbrella Type వెయ్యటానికి దీనికి Set అవ్వదు.
Cloth Required For Long Frock For Umbrella Type Model
YEARS | Body Piece ( In Centimeters ) | Frock Piece ( Umbrella Type ) (in Meters) |
వయసు | బాడీ పీస్ ( సెంటీమీటర్స్ లో ) | ఫ్రాక్ పీస్ ( మీటర్స్ లో ) |
1 – 3 Years | 40 Cms | 1.5 Meters |
4 – 6 Years | 50 Cms | 2 Meters |
7 – 9 Years | 70 Cms | 2.5 Meters |
10 – 12 Years | 80 Cms | 3 Meters |
13 & Above Years | 80 Cms | 3.5 Meters |
Frock Piece కోసం Umbrella Type Cloth తీసుకోవాలి అంటే ఈ Table లో చెప్పిన విధంగా తీసుకోండి.
లైనింగ్ (Lining) ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు:-
- అంబ్రెల్లా కటింగ్ (Umbrella Cutting) అవసరం లేదు అనుకుంటే Straight గా కుచ్చిళ్ళు పెట్టి లైనింగ్ వేసుకోవచ్చు.
- ఫ్రాక్ పీస్ కి పెట్టినంత Full Flair అవసరం లేదు అనుకుంటే ఫ్రాక్ పీస్ లో సగం పెట్టుకోవచ్చు.
- ఫ్రాక్ పీస్ కి ఎంత Circle వస్తుందో అంతే లైనింగ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఐతే లైనింగ్ ఎక్కువ పడుతుంది.
ఎంత Cloth పడుతుంది అని నేను చెప్పినది పైన వీడియోలో ఉన్న మోడల్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కి మాత్రమే.
పైన వీడియో ఉంది కదా ఒకసారి చూడండి మీకు ఒక Clarity వస్తుంది .
గమనిక:- ఇప్పుడు నేను చెప్పినది ఒక అంచనాతో మాత్రమే. ఎందుకు అనగా కొంత మంది కొంచం లావుగా ఉండవచ్చు, కొంత మంది కొంచం సన్నగా పొడవు గా ఉందవచ్చు. కనుక వారి Body Measurements కి ఒక పావు(1/4) మీటర్ Cloth అటు ఇటు గా పట్టవచ్చు. ఈ విషయం గమనించుకొని మీకు ఎంత cloth పడుతుందో చూసి తీసుకోండి.
Mana Mudhra Videos Youtube Channel Ni Subscribe Chesukondi Inka New Models and Updates Kosam.